మరణానంతరం ఫిల్మ్ ఫేర్ దక్కించుకున్న నటుడు

బాలీవుడ్ తో పాటు పాటు అన్ని భాషల సినీ ప్రముఖులు కూడా ఎంతో గౌరవంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డులు గత రాత్రి బాలీవుడ్ సినీ ప్రముఖులకు ఇవ్వడం జరిగింది. బాలీవుడ్ లో 66వ ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తాప్సి నటించిన తప్పడ్ సినిమాకు ఏకంగా ఏడు అవార్డులు రాగా అమితాబ్ నటించిన గులాబో మరియు సితాబో సినిమా ఏకంగా ఆరు అవార్డులను దక్కించుకుంది. ఇక దివంగత స్టార్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తాను నటించిన అంగ్రేజీ మీడియంకు గాను ఉత్తమ నటుడిగా ఎన్నిక అయ్యారు. ఆయన కు అవార్డు ప్రకటించిన సమయంలో అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఎమోషనల్ అయ్యారు. ఆయన అవార్డు ను తనయుడు బాబిల్ అందుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ గత ఏడాది ఏప్రిల్ 29న కన్నుమూసిన విషయం తెల్సిందే. అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఆయన చివరి మూవీ అంగ్రేజీ మీడియం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంగ్రేజీ మీడియం సినిమాను కూడా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతూనే పూర్తి చేశారు. ఆరోగ్యం సహకరించకున్నా కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంగ్రేజీ మీడియంకు దక్కిన విజయంను చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఆయన కు ఫిల్మ్ ఫేర్ అవార్డు రావడం పట్ల మరింతగా ఆనందం వ్యక్తం అవుతోంది. ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ కు ఆయుష్మాన్ ఖురానా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాబిల్ కు మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.