పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని మరువలేం – తిరుపతి జనసేన

తిరుపతి, పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తిరుపతిలో శుక్రవారం జనసేన నాయకులు వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు రాజారెడ్డి మరియు నాయకులు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలను సైతం అర్పించిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని మరువలేమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు రాజారెడ్డి, దినేష్ జైన్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన, రాజేష్ ఆచారి, రాజమోహన్, హిమవంత్, రవికుమార్, షరీఫ్, కృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.