MEGA పవర్ స్టార్ కి పవర్ ఫుల్ బర్త్ డే ట్రిబ్యూట్ సాంగ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు సొషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. మార్చ్ 27న చెర్రీ బర్త్ డే కావటంతో కొందరు స్పెషల్ సాంగ్ విడుదల చేశారు. మథుర ఆడియో వారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఈ సాంగ్ నెటిజన్స్ ను అలరిస్తోంది. ‘మెగా పవర్ స్టార్’ అంటూ సాగే ఈ ఫ్యాన్ సాంగ్ కి ‘ఎస్‌జేపీ’ లిరిక్స్ అందించటంతో పాటూ పాడారు కూడా. మధ్యలో వినిపించే జోష్ ఫుల్ హిందీ ర్యాప్ అరిన్ డెజ్ ఆలపించారు. ‘ద డ్రాప్ లెట్జ్’ అందించిన సంగీతం చరణ్‌ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా ఉంది.