సీటీమార్ హిట్ పై ప్రభాస్ రియాక్షన్

సంపత్ నంది దర్శకత్వంలో… గోపీచంద్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సిటీ మార్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. మంచి కలెక్షన్లను కూడా సాధిస్తోంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా హిట్ సాధించడంపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు.

నా స్నేహితుడు గోపీచంద్ సీటీమార్‌ తో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆయనకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదటి పెద్ద చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు వచ్చినందుకు చిత్ర బృందానికి అభినందనలు అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు ప్రభాస్.