‘లైగర్’ సినిమాలో ప్రభుదేవా!

హీరో విజయ్​ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లైగర్​’. కథానాయిక​గా అనన్య పాండే నటిస్తుండగా.. కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. పాన్​ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో ప్రముఖ డ్యాన్సర్​, నటుడు ప్రభుదేవా నటించబోన్నాడనే వార్తల నేపథ్యంలో.. తాజాగా ప్రభుదేవా లైగర్ బృందంతో కలిసి దిగిన ఫోటో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రభు నటించనున్నాడా లేదా ఏదైనా స్పెషల్​ సాంగ్​కు కొరియోగ్రఫీ చేయనున్నాడా అనేది తెలియాల్సింది. అయితే ప్రభుదేవా, టైగర్ బృందం ముంబైలోనే ఉండటంతో మామూలుగానే కలిస్తుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది.