*కాకినాడ యోగాంధ్రలో రాష్ట్ర చైర్మన్ తోట సుధీర్ పాల్గొని సందేశం
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కాకినాడ వేదికగా రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పాల్గొని, యోగా ప్రాముఖ్యతపై అమూల్యమైన సందేశాన్ని ప్రజలకు అందించారు. ఆరోగ్యంగా జీవించాలంటే యోగాను ఆచరించండి అనే పిలుపుతో, యువతతో పాటు ప్రతి ఒక్కరూ యోగా సాధనను రోజువారీ జీవనశైలిగా మార్చుకోవాలని ఆయన తెలిపారు.
Share this content:
Post Comment