కంగనపై ప్రకాశ్‌రాజ్‌ సెటైర్‌..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. #justasking పేరుతో వివిధ అంశాలపై పోస్టులు చేస్తుంటారు. తాజాగా ప్రకాష్ రాజ్ ‘మణికర్ణిక’ సినిమాలో నటించినంత మాత్రాన కంగనా రనౌత్‌ రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్‌ అయిపోతారా..! అని అంటున్నారు.

కంగనా సంచలన కామెంట్స్ తో ఈమధ్య బాగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణం అనంతరం ఆమె మరింత దూకుడుగా వ్యవహరిస్తూ బాలీవుడ్ ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపధ్యం లో తాజాగా ప్రకాష్ రాజ్ కంగనాపై సెటైర్లు వేశారు. ఒక్క సినిమాతోనే కంగనా.. తనను తాను రాణి లక్ష్మిబాయి అనుకుంటుందని.. అప్పుడు దీపికా పదుకునే-పద్మావతి, షారుక్ ఖాన్-అశోక, అజయ్ దేవగన్-భగత్ సింగ్, అమీర్ ఖాన్-మంగళ్ పాండే, హృతిక్ రోషన్-అక్బర్ మరి వీళ్ళు కూడా అదే అర్ధం వచ్చేలా ఆలోచించాలా అని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.