నాగబాబును కలిసిన ప్రమీలా ఓరుగంటి

నెల్లూరు: మర్రిపాడు మండల అధ్యక్షురాలు ఓరుగంటి ప్రమీల మండలంలో జనసేన పార్టీ బలోపేతంకు చేస్తున్న కృషి అభినందనీయం అని నాగబాబు తెలిపారు. నాగబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటనలో బాగంగా ఆదివారం మర్రిపాడు మండల అధ్యక్షురాలు ప్రమీల నాగబాబును కలిసి పార్టీ తాము పార్టీ కోసం చేస్తున్న పనులను వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. జిల్లాలో మండల అధ్యక్షురాలిగా ఉన్న ఏకైక మహిళ ప్రమీల అని పార్టీ నిర్మాణంలో పోరాటాల్లో వీరమహిళల పాత్ర ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మండల నాయకులు పెనుమాది నరసింహ ఈరుపోతు ఉదయ్ గంటా అంజి చిన్నా జనసేన పాల్గొన్నారు.