*సేవా దృక్పథంతో చారిటబుల్ ట్రస్ట్‌లో ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు
పలాస నియోజకవర్గం, మెలియాపుట్టి మండలం, పరుశురాంపురం గ్రామానికి చెందిన జనసైనికుడు గణప. ప్రసాద్ తన పుట్టినరోజును అందరిలా జల్సాలు, పార్టీలతో కాకుండా ఒక ప్రత్యేకమైన విధంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మానవత్వాన్ని చూపుతూ, కోసంపురం గ్రామంలోని లలిత చారిటబుల్ ట్రస్ట్‌లో ఆశ్రయంగా ఉంటున్న అనాధలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సెలబ్రేషన్‌కు బదులు సేవా దృక్పథంతో నిలిచిన ఈ గెస్టర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. రేపటి సమాజంలో మానవతా విలువలు మరింత పెరిగేలా చాటైన ఈ చర్యకు అభినందనలు.
Share this content:
Post Comment