జనసేన అధినేత పవన్ ఆరోగ్యం కోసం పూజలు

కోనసీమ జిల్లా, అమలాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుట పడాలని పూజలు చేసారు. పవన్ కళ్యాణ్ సేవాట్రస్ట్ అధ్యక్షులు మోటూరి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారినుండి తొందరగా కోలుకోవాలని అమలాపురం ముస్లిం వీధిలో శ్రీదేవి అమ్మవారి ఆలయంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు జరిపించారు.