నేడే పీఆర్‌సీ విడుదల.. ఫిట్‌మెంట్ 7.5

వేతన సవరణతో పాటు ఇతర అంశాలపై నేటి నుంచి ఉద్యోగ సంఘాలతో అధికారుల కమిటీ చర్చలు జరపనుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ చర్చలు నిర్వహించనుంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిటి నివేదిక విడుదల చేసింది. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు 10శాతం ఫిట్మెంట్‌కు సిఫార్సు చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60ఏళ్లకు పెంచాలని కమిషన్ రెకమండ్ చేసింది. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ అందించాలని సిఫార్స్ చేసింది.

నేటి సాయంత్రం 5 గంటలకు 13 గుర్తింపు సంఘాలతో సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చర్చలు అన్ని సంఘాల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తీసుకున్న తరువాత సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సీఎం కేసీఆర్కు బ్రీఫ్ నోట్ ఇవ్వనుంది. ఈ నెలాఖరులో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో చర్చించి పీఆర్సీ ఫిట్ మెంట్ ప్రకటించనున్నారు. తొలుత ఉద్యోగ సంఘాలకే నేరుగా ఇవ్వాలని భావించారు. కానీ, ఆయా సంఘాల వినతితో నివేదికను వెబ్‌సైట్‌లో పెట్టడంతో పాటు చర్చల్లో ఉద్యోగ సంఘాల వారికి ప్రతులను అందజేయనున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్‌లతో గల త్రిసభ్య కమిటీ నేటి నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది.

మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని పీఆర్సీ నివేదికలో పేర్కొంది. ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలు ఉండాలని సిఫార్సు చేసింది. గరిష్ట వేతనం 1,62,070 వరకు ఉండొచ్చని సిఫారసు చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏండ్లకు పెంచాలని, హెచ్ఆర్ఏ తగ్గిస్తూ సిఫార్సు చేసింది. గ్రాట్యుటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెంపు, శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంపు, సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. 2018 జులై 1వ తేదీ నుంచి వేతన సవరణ అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. 32 నెలలపాటు కొనసాగిన అధ్యయనం గత నెల 31న సీఎస్కు అందించిన విషయం తెలిసిందే.