వీరమహిళలను సత్కరించిన ప్రేమకుమార్

కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కెపిహెచ్బి కాలనీ 5వ ఫేస్‌లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వీర మహిళా విభాగం మహిళలతో కలిసి ప్రత్యేక వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు, టిటిడి బోర్డు సభ్యుడు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, వీర మహిళా అధ్యక్షురాలు కావ్య మండపాక హాజరయ్యారు. అలాగే, ప్రత్యేక అతిథులుగా గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ అధ్యక్షుడు రాధా రాం రాజలింగం, దామోదర్ రెడ్డి, సంపత్ నాయక్, వీర మహిళ శిరీష, హైకోర్టు అడ్వకేట్ యామిని చంద్రిక పాల్గొన్నారు. వీరందరూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీర మహిళలను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్, మహేందర్ రెడ్డిలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వీర మహిళలు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రశ్నించాలని, ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆధునిక యుగంలో మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ, కుటుంబ నిర్మాణంలో, పిల్లల సంరక్షణలో, పెద్దల బాగోగులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహిళా శక్తి అసాధారణమైనదని, వారు ఎక్కడ పనిచేసినా ఆ ప్రదేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళల ప్రాముఖ్యతను గుర్తించి వారికి రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో వీర మహిళా నాయకురాలు భాగ్యలక్ష్మి, ముంతాజ్, స్వప్న, శిరీష, గాలి అనిత, వెంకటలక్ష్మి, మల్లేశ్వరి, ద్రాక్షాయణి, పుష్పలత, ఇతర వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment