‘ప్రేమ కాదంట’ అల్లుశిరీష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసులిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్, అల్లు శిరీష్ వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. బన్నీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక శిరీష్ మంచి సక్సెస్ సాధించేందుకు కొన్నాళ్లుగా కృషి చేస్తున్నాడు.  ప్రస్తుతం రాకేష్ శశి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని అలాగే టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ప్రేమ కాదంట అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని పెట్టారు. ఇక ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఫస్ట్ లుక్ తో పాటు మరో లుక్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

రెండింటిలో కూడా రొమాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను జీఏ2పిక్చర్స్ బ్యానర్, మరో నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఈ న్యూఏజ్ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు.