బాలానగర్ విమల్ థియేటర్‌లో గురువారం ఉదయం 11:10 గంటలకు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ ప్రదర్శన వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, ఇతర జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా థియేటర్ పరిసరాలు జై పవన్ నినాదాలతో మార్మోగాయి. అభిమానుల ఉత్సాహం, పార్టీ శ్రేణుల సమాఖ్య ఈ వేడుకను విజయవంతంగా మార్చాయి.
Share this content:
Post Comment