క్షణం క్షణం ఎన్నికల కోసం సన్నద్దం

  • ఆశయం, అనుభవం ఉన్న నాయకులతోనే రాష్ట్రం సుభిక్షం
  • వచ్చే ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు… ప్రజలు
  • తంబళ్లపల్లి జనసేన, టిడిపి సమన్వయ సమావేశంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తంబళ్లపల్లె: అనుభవం ఉన్న చంద్రబాబు, ఆశయంతో ఉన్న పవన్ కళ్యాణ్ లతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. మంగళవారం తంబళ్లపల్లి నియోజకవర్గ జనసేన, టిడిపి సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాధ మాట్లాడుతూ తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్.. కాబోయే ఎమ్మెల్యే అంటూ జోస్యం చెప్పారు. రెండు పార్టీల్లోని రాష్ట్ర నాయకత్వం మాత్రమే కాకుండా… గ్రామస్థాయిలో కూడా రెండు పార్టీల నాయకులను ఏకం చేసేందుకే సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. 14 ఏళ్లు సిఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రం వైపు ప్రపంచ దేశాలు చూసేలా చేశారన్నారు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు స్వలాభం కోసం సాయం చేస్తారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కష్టంలో ఉన్న వ్యక్తికి అండగా నిలబడ్డారన్నారు. జైలు గోడల సాక్షిగా స్వార్ధం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశారన్నారు. రాష్ట్రం కష్ట సమయంలో ఉన్నప్పుడే టిడిపి, జనసేన కలిశాయన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారని, పదవిపై ఆశతో కాదని తెలిపారు.‌ రాష్ట్రాన్ని, ప్రజలను గెలిపించాలని ఇద్దరు నేతలు ఒకటయ్యారని తెలిపారు. చంద్రబాబు ఎన్నో పరిశ్రమలు తెచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. ప్రజలు జనసేన, టిడిపికి ఓటు వేయాలని ఫిక్స్ అయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన నాయకులు చేయాల్సింది రాజకీయం కాదని.. యుద్దం చేయాలన్నారు. రాబోయే 120 రోజులు అనుక్షణం ఎన్నికల గురించే ఆలోచించాలన్నారు. రెండు పార్టీల్లోని నాయకులు ఏ రంగంలో ఉన్నా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరి ప్రసాద్ టీడీపీ తంబల్లపల్లి ఇంచార్జి శంకర్ యాదవ్, టీడీపీ అబ్సెర్వర్ గురువారెడ్డి, జనసేన పాయింట్ అఫ్ కాంటాక్ట్ ఇంచార్జి సాయి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు, లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, తిరుపతి ఉపాధ్యక్షులు పార్ధు, టీడీపీ బీ కొత్తకోట మార్కెట్ యార్డ్ శ్రీనాథ్ రెడ్డి, మండల నాయకులు రమేష్, పవన్, బావాజీ, శంకర్, దాము, నాగరాజు, ప్రోగ్రామ్స్ కమిటీ మెంబెర్ రెడ్డి మోహన్, టీడీపీ నాయకులు ఆనంద్ రెడ్డి, హుస్సేయిన్ వల్లి, మస్తాన్, సురేంద్ర యాదవ్, శ్రీనివాస్, ఈశ్వరప్ప తదితర జనసేన టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.