పాలకొండ నియోజకవర్గం, పురాతన ఆలయాల పరిరక్షణ ప్రజల భాద్యత అని పాలకొండ నియోజకవర్గ ఎన్.డి.ఏ కూటమి జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. పాలకొండలో వేంచేసి ఉన్న, పురాతనమైన శ్రీశ్రీశ్రీ సీతారామస్వామి దేవస్థానం ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హజరయ్యరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ ఆలయ విశేషాలను, ప్రతిష్టాపన మహోత్సవ వివరాలను తెలుసుకున్నారు. దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఎటువంటి సేవలు అవసరమైన తనవద్దకు తీసుకుని వస్తే సత్వరమే ఈ సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అనేకమంది మహిళలు, భక్తులు విచ్చేసి ఎమ్మెల్యేకి తమ సమస్యలు వివరించి ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఆలయాలు అభివృద్ధి కోరకు ఎప్పుడు అండగా ఉంటుందని కూటమి జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి శేషాచార్యులు, పాలకొండ తెలుగుదేశం పట్టణ పార్టీ అధ్యక్షుడు గంటా సంతోష్, జనసేన పాలకొండ పట్న అధ్యక్షులు ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు కొండదాడి రాజేష్, కొండపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment