ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలి!!

  • సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వబ్బిన సన్యాసి నాయుడు

శ్రీనగవరపు కోట: ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవ ప్రతీక, ప్రభుత్వ కార్య కళాపాలకు ప్రధాన వేదిక గా ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయంను 370 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టడం అంటే రాష్ట్రంలో ఉన్న5 కోట్ల ప్రజల ఆత్మగౌరవంను తాకట్టు పెట్టడంతో సమానం అని కాపు ఉద్యమ నేత సన్యాసి నాయుడు సిఎం జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్ 2.86 లక్షల కోట్లు ఉండగా కేవలం 370 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టిన జగన్ ప్రభుత్వంను వెంటనే రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని సికా రాష్ట్ర అధ్యక్షులు వెల్పురి శ్రీనివాసరావు, ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపదికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి 25 వేల కోట్లు, లిక్కర్ వ్యాపారం నుంచి 48 వేల కోట్లు అప్పులు తీసుకొని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. 10 సంవత్సరాల నుండి బైల్ మీద ఉండి రాష్ట్రంలో అవినీతి, రాజ్యాంగ ఉల్లంఘనలకు, అక్రమాలకు పాల్పడుతున్న జగన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని సన్యాసి నాయుడు కోరారు. 365 రోజుల్లో 340 రోజులు అప్పులు లేకుండా పూట గడవని దుస్థితికి తీసుకు వచ్చాడు అని కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని వేదిక పేర్కొనడం సిగ్గుచేటని వబ్బిన సన్యాసి నాయుడు పేర్కొన్నారు.