మదనపల్లి జనసేన కార్యాలయంలో విలేకరుల సమావేశం

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి పట్టణం స్థానిక బర్మా రోడ్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని, ప్రతి జనసైనికుడు, వీరమహిళలు పార్టీ కోసం ఎంతగానో శ్రమిస్తున్నారని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఇకముందు మరింతగా ప్రజల్లోకి వెళ్లి వైసిపి పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, మీరు పార్టీలు కలిసి ఓటర్ లిస్టులో ఉన్న దొంగ ఓట్లు కనిపెట్టి, బైటూరులో ఉన్న వారి ఓట్లను తొలగించేలా బి ఎల్ వాళ్లతో వాలంటీర్లతో సమితితో అధికారులతో చర్చించి ఓటర్ లిస్ట్ లోని అక్రమాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన బూతుల బిఎల్వోలు వాలంటీర్ మీద చర్యలు తీసుకునేలా అక్రమ ఓటర్ల జాబితాను బయట పెట్టడం జరుగుతుందని ఈ సమావేశం ద్వారా తెలియజేశారు. తిరుపతి లోకసభ ఫ్రీ ఎలక్షన్స్ లో అక్రమ భౌతిక సహకారం అందించారని ఐఏఎస్ అధికారి అన్నమయ్య జిల్లా కలెక్టర్ పిఎస్ గిరిష గారిని విధుల నుండి తొలగించిన విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు దారం హరిప్రసాద్, కుప్పల శంకర, కోటకొండ చంద్రశేఖర్, వినయ్ కుమార్ రెడ్డి, షేక్ యాసిన్, జనసేన సోను, సుప్రీం హర్ష, గంగాధర్, జాఫర్ రెడ్డి, గోపాల్, శేఖర్, బహదూర్, వీరమహిళలు రూప, లక్ష్మీదేవి, స్వర్ణ, తదితరులు పాల్గొన్నారు.