శ్రీకాకుళం జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం

శ్రీకాకుళం జిల్లా, జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆమదాలవలస జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ అయ్యా జగన్మోహన్ రెడ్డి మీకు జనసేన నాయకులు అంటే ఎందుకు అంత భయం మీరు చేసే ఇసుక దందాలు మరియు మీరు ఇచ్చిన హామీలు మరి ముఖ్యంగా మీరు ఆమదాలవలస నడిబొడ్డున మీరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఇచ్చిన హామీని ఎక్కడ నిలదిస్తారని హుటాహుటిన తెల్లవారు జామున 5 గంటలకి పోలీస్ లని పంపి అరెస్ట్ చేశారు. జగన్మోహన్ అరెస్ట్ లతో మీరు మమ్మల్ని అపగలరేమో గాని ప్రజల పవన్ రావాలి పాలన మారాలి అనే బలమైన స్వరాన్ని మీరు మార్చలేరని పేర్కొన్నారు.

పాతపట్నం ఇంచార్జి గేదెల చైతన్య మాట్లాడుతూ వంశధార నిర్వాసితుల 2013 భూ పరిహార చట్టం ప్రకారం ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు.

అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకుడు, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా విశ్వక్షేణ్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు మరియు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిల్లల కోసం నిర్వహించిన సభలో రాజకీయాలు ఏంటని విశ్వక్సేన్ మండిపడ్డారు. ఉద్దానం సమస్య బయటికి రావడానికి కారణం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని మరొక్కసారి గుర్తు చేశారు. అలాగే పాదయాత్ర సమయంలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చేసిన హామీలలో బుడగుట్ల పాలెం ఫిషింగ్ హార్బర్, స్థానికులకు ఉద్యోగాలు నెరవేర్చమని మరొకసారి గుర్తు చేశారు.

అనంతరం టెక్కలి నియోజకవర్గ ఇంచార్జి కణితి కిరణ్ మాట్లాడుతూ గతంలో టెక్కలి నియోజకవర్గ పాదయాత్రలో భాగంగా జగన్ హామీ ఇచ్చినట్టు 1108 జీ.ఓ ఎందుకు రద్దు చేయలేదు మరియు రైతులు, గ్రామస్థులు, ఉద్యమ కారులు మీద పెట్టిన కేస్ లు ఎందుకు ఎత్తివేయలేదు, ఉత్తర ఆంధ్ర సృజల స్రవంతి కోసం వచ్చే బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో ఎందుకు చెప్పలేక పోయారని డిమాండ్ చేశారు.

ఎచ్చర్ల నియోజకవర్గ నాయకులు అర్జున్ భూపతి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న 29 ఫ్యాక్టరీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. అలాగే తోటపల్లి రిజర్వాయర్ నీరు నాలుగు మండలాలకి అందక పోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు మీకు పట్టవా అని నిలదీయడం జరిగింది. మడ్డువలస రిజర్వాయర్ ద్వారా వస్తున్న నీరు జి.సిగడాం లావేరు మండలాల్లో ఉన్న రైతులకు ఏమాత్రం కూడా అందడం లేదు సుమారు 4800 మంది రైతులు ఈ కాలువ ప్రక్కనే పొలాలు ఉండి కూడా వర్షాధారం మీద ఆధారపడే పరిస్థితి ఉంది ఇది మీకు కనబడుట లేదా? అని నిలదీయడం జరిగింది.