యువశక్తి సభను విజయవంతం చేయాలని పత్రికా సమావేశం

నెల్లిమర్ల నియోజవర్గం, డెంకాడ మండల జనసేన పార్టీ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈనెల 12 న నిర్వహించ తలపెట్టిన యువశక్తి సభను విజయవంతం చెయ్యాలి అని జనసేన పార్టీ నాయకులు, క్రియాశీలక సభ్యులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ యువశక్తి మహాసభ ప్రచార కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ మంగళవారం నెల్లిమర్ల నియోజకవర్గం మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో రణస్థలం యువశక్తి మీటింగు విజయవంతం చేయాలని మాట్లాడడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు లోకం మాధవి, తుమ్మి లక్ష్మి మరియు మత్స్యకార వికాస విభాగం కమిటీ సభ్యుడు కారేపల్లి రాజు మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.