కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో పత్రికా సమావేశం

కాకినాడ సిటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పత్రికావిలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య మాట్లాడుతూ.. కాకినాడ సిటి ఇంచార్జ్ ఆదేశాల మేరకు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కాకినాడలోని స్కూళ్ళను ఏమాత్రం అభివృద్ధి చేస్తున్నారో నిజాలు తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలో ప్రరిశీలనకు వెళుతుంటే దిగ్భ్రాంతికర విషయాలు తెలుస్తున్నాయన్నారు. గతంలో కూడా తామందరం ముత్తా శశిధర్ గారితో పాటు కలిసి దేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్వం ప్రారంభించబడిన మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్థలంలో ఇతర నిర్మాణాలు చేపట్టడంపై ఆందోళన నిర్వహించి, తీవ్రంగా వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చెపట్టామనీ, ఇప్పుడు విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయడంపై తీవ్రంగా నిరశిస్తున్నామన్నారు. రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా ముత్తా శశిధర్ గారు పార్టీ శ్రేణులు కలిసి పట్టణంలో ప్రభుత్వ స్కూళ్ళను సందర్శించడం జరుగుతోందనీ, చాలా స్కూళ్ళు దూరంగా ఉన్న స్కూళ్ళలో విలీనం చేయడమో లేక మూసివేయడమో చెసారన్న విషయం బయటపడిందన్నారు. లేకపోతే స్కూలు బిల్డింగులు యేళ్ళ తరబడి నిర్మాణంలో సాగుతున్నాయని ఎప్పటికి పూర్తవుతాయో దేవుడికే యెరుక అన్నట్టున్నాయన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలతో విధ్యార్ధుల భవిష్యత్తు నాశనమయ్యే విషయాలపై రేపు కాకినాడ నగరానికి విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి స్కూళ్ళను, స్కూళ్ళ ఆస్థులను రక్షించమంటూ ఆయనకు వినతిపత్రాన్ని ఇస్తామని జనసేన పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ పత్రికా విలేఖరుల సమావేశంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, సిటి ఉపాధ్యక్షులు అడబాల సత్యన్నారాయణ, వార్డు అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, మనోహర్లాల్ గుప్తా, నాయకులు ఎం.కోటేశ్వరరావు, చీకట్ల శ్రీనివాస్, జనసైనికులు పాల్గొన్నారు.