విజయనగరం జనసేన ఆధ్వర్యంలో పత్రికా సమావేశం

విజయనగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ యువశక్తి మహాసభ ప్రచార కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, తాడేపల్లిగూడెం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీను, ఏలూరు ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు, లోకం మాధవి, గురాన ఆయ్యలు, ఆదాడ మోహన్ తుమ్మి లక్ష్మి మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.