నాగ్ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రీ లుక్!

నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నాగార్జున ఫేస్ ను రివీల్ చేయకుండా ఈ ప్రీ లుక్ ను వదిలారు. పూర్తి బ్లాక్ కలర్ డ్రెస్ తో .. నెత్తుటి ధారలతో తడిసిన ఖడ్గం పట్టుకుని ఆయన వర్షంలో నడుస్తున్నట్టు ఈ పోస్టర్లో కనిపిస్తోంది.

ఈ నెల 29వ తేదీన ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ ఉంటుందనే విషయాన్ని ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. బహుశా అప్పుడు టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను వదిలే అవకాశం ఉంది. ఈ సినిమాలో నాగార్జున కొత్త లుక్ తో కనిపించనున్నారు. ‘గరుడ వేగ’ తరువాత ప్రవీణ్ సత్తారు చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ మధ్య కాలంలో నాగార్జున యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. అందుకు నిదర్శనంగా ‘ఆఫీసర్’ .. ‘వైల్డ్ డాగ్’ .. సినిమాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా అదే తరహాలో నిర్మితమవుతోంది. కాజల్  కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.