జాతీయ స్థాయిలో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్ట్స్ సమస్యలకు ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి

*ఏ ఐ ఎన్ ఎఫ్, సి డబ్ల్యూ సి కూచిపూడి సమావేశం విజ్ఞప్తి.

*ఏ పి జే యూ 35 వ వార్షికోత్సవాన్ని ప్రారంభించిన మండలి బుద్ధ ప్రసాద్

జాతీయ స్థాయిలో జర్నలిస్ట్స్ మరియు నాన్ జర్నలిష్టుల వృత్తి స్వేచ్చకు సర్వీస్ నిబంధనలు అడ్డంకిగా వున్నాయని, వాటి సవరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏ ఐ ఎన్ ఈ ఎఫ్ ) జాతీయ కార్యవర్గ సమావేశం (సి డబ్ల్యూ సి) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ కూచిపూడి నృత్య కేంద్రం కూచిపూడిలోని ఎస్ ఎస్ ఎల్ కన్వీన్షన్ సెంటర్ లో రెండు రోజులపాటు జరిగింది. ఏ ఐ ఎన్ ఈ ఎఫ్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశం ఆమోదించిన తీర్మానాలను జాతీయ సీనియర్ ఉపాధ్యక్షుడు చలాది పూర్ణచంద్ర రావు నేడిక్కడ విడుదల చేశారు. ప్రస్తుతం అమలులో వున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ మరియు నాన్ జర్నలిస్ట్స్ మిస్లేనియస్ యాక్ట్ 1955 ని రద్దుచేసి కొత్త చట్టం తేవాలని, ప్రస్తుతం సాగుతున్న కొత్త వేతన సవరణ చట్టం తెచ్చే ప్రక్రియను వేగవంతం చెయ్యాలని తద్వారా జర్నలిస్ట్స్, నాన్ జర్నలిస్ట్స్ ల ఆర్ధిక పరిస్థితి పెరిగి వారి జీవన ప్రమాణము మెరుగయ్యేలా చూడాలని సమావేశం తీర్మానించినట్లు పూర్ణచంద్ర రావు తెలిపారు. కొన్ని మీడియా హౌస్ మేనేజ్మెంట్ లు పూర్వంలా కనీసం కాంట్రాక్టు పధ్ధతికూడా కాకుండా నేరుగా మీడియా హౌస్ మేనేజ్మెంట్లతో ఏమాత్రం సంబంధము లేకుండా థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వం ద్వారా నియామకాలు చేస్తూ వేతన సిఫార్సులు అమలు చెయ్యకుండా లేబర్ చట్టానికి దొరకకుండా జాగ్రత్తపడుతున్నాయని వాటిని నిరోధించేలా చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. నూతన వెజ్ బోర్డు సిఫార్సులు వచ్చేవరకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని కనీసం 2011 లో అందించిన వేజ్ బోర్డు సిఫార్సులను పునరుద్దరించి, వెంటనే అమలు చేసైనా జర్నలిస్టులు, నాన్ జర్నలిష్టుల పడిపోయిన జీవన ప్రమాణాలు మెరుగు పర్చాలని, అలాగే తీవ్రంగా పెరిగిన నిత్యావసర సరుకుల కొనుగోలు శక్తి మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కి సమావేశం ఏకగ్రీవం గా విజ్ఞప్తి చేసింది.
ఈ సమావేశంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చలాది పూర్ణచంద్ర రావు, జనరల్ సెక్రటరీ వి. బాలగోపాలన్ తో పాటు అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు, న్యూ ఢిల్లీ, కేరళ, గుజరాత్లతో పాటు ఇతర రాష్ట్రాలనుండి సి డబ్ల్యూ సి సభ్యులు హాజరైయ్యారు. కాగా తొలిరోజు ఏ పి జే యూ 35 వ వార్షికోత్సవం లోకి ప్రవేశించిన సందర్భంగా జరిగిన సభలో ఏపీజే యూ గౌరవాధ్యక్షులు, మాజీ మంత్రి, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ ఏపీజేయూ జెండా ఊపి 35 వ వార్షికోత్సవాన్ని ప్రారంభించి అనంతరం తన అధ్యక్షోపన్యాసంలో జాతీయస్థాయిలో జర్నలిస్టులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం పత్రికా రంగానికి ఎలక్ట్రానిక్ ప్రసారమాధ్యమాలు, సోషల్ మీడియా, ఫేస్ బుక్ సవాలుగా మారాయని అభిప్రాయపడ్డారు. శాస్త్ర సాంకేతిక రంగాన్ని సరైన మార్గంలో వినియోగిస్తూ మలచాలని పేర్కొంటూ. సమాజంలో వివిధ రంగాలు విలువ కోల్పోయాయని ఇలాంటి క్లిష్ట సమయంలో తిరిగి విలువలు కాపాడే శక్తి పత్రికా రంగానికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు వారికి మాత్రమే అనుకూలమైన వార్తలను ప్రచురిస్తూ పాఠకులను, ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని వాపోయారు. ముఖ్యంగా సమాజంలో నిష్పక్షపాతంగా నిర్మొహమాటంగా వున్నది ఉన్నట్లు సమాచారం అందిస్తున్న గ్రామీణ విలేకరులు పలువురికి సరైన గుర్తింపు లభించడం లేదని ఆవేదన చెందారు. చరిత్ర గల ప్రాంతమైన దివిసీమలోని ప్రముఖ నాట్య కళా కేంద్రం కూచిపూడికి జాతీర్య స్థాయిలో పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన నేతలకు బుద్ధప్రసాద్ అభినందనలు తెలిపారు. మొవ్వ రోడ్ ఎస్ ఎస్ ఎల్ కన్వర్బన్ హాల్లో కొనసాగిన ఈ కార్యక్రమానికి యూనియన్ ప్రధాన కార్యదర్శి సలాది పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో గడచిన దశాబ్దంగా ఏపీజే యూ గౌరవాధ్యక్షులుగా వున్న మండలి బుద్ధ ప్రసాద్, యూనియన్ శ్రేయోభిలాషులు పి ఎస్ ఆర్ హౌసింగ్ అధినేత డాక్టర్ పి ఎస్ రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాసరావు, మొవ్వ ఏఎంసీ మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త, ఎస్ ఎస్ ఎల్ కన్వెన్షన్ సెంటర్ అధినేత చీకటి మర్ల శివరామ ప్రసాద్, ఏ పీజే యూ కోశాధికారి ఆర్ డి ప్రసాద్ కూచిపూడి గ్రామ సర్పంచ్ కొండవీటి వెంకటరమణ విజయలక్ష్మి లను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో పాల్గొనేందుకు హాజరైన సి డబ్ల్యూ సి ప్రతినిధులు, ఏపీజే యూ ప్రతినిధులు, ఆహ్వానితులు కూచిపూడి లోని శ్రీ సిద్దేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం, రవి ప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవినివైద్యాలయాన్ని సందర్శించి వాటి విశేషాలు తెలుసుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రారంభ సభకు ముందు కూచిపూడి శ్రీ సిద్దేంద నాట్య కళాపీఠం ఇంచార్జి ప్రిన్సిపాల్ పసుమర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రదర్శించిన మోహిని భాస్మాసుర సృత్య నాటకం, ఇతర అంశాలు తమకు సంభ్రమాశ్చర్యలు కలిగించాయన్ని వివిధరాష్ట్రలకు చెందిన ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశాలు విజయవంతంగా నిర్వహించటములో యూనియన్ కి అండదండలిస్తున్న స్పాన్సర్లు, యావత్ కార్యక్రమం తమ భుజస్కాందాలపై మోసి విజయవంతం చేసిన శ్రేయోభిలాషులు కోనేరు ఆనంద్, బెల్లంకొండ వెంకటేశ్వర రావు, రంగావలి లకు ఏపీజే యూ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్ర రావు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏపీజేయూ అదనపు ప్రధాన కార్యదర్శి జి ఎన్ రావు (పండుబాబు) సీనియర్ నాయకులు తూము పార్థసారధి, ఫాల్గొన్నారు.

WhatsApp-Image-2025-02-27-at-4.07.46-PM-1024x680 జాతీయ స్థాయిలో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్ట్స్ సమస్యలకు ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి

Share this content:

Post Comment