పవన్ కళ్యాణ్ చేసిన పోరాటాలు మరియు దానాలు కరపత్రంగా ముద్రించి వితరణ

మార్కాపురం, ఆంధ్రప్రదేశ్లోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలు మరియు దానాలు ఒక కరపత్రంగా ముద్రించి, మార్కాపురం సాయి బాలాజీ థియేటర్ వద్ద, “భీమ్లా నాయక్” సినిమా రిలీజ్ సందర్భంగా జిల్లా జాయింట్ సెక్రెటరీ సురేష్ బాబు మరియు జనసైనికులు వీరీశెట్టి శ్రీను, హరి కరపత్రాలు అందరికీ పంచడం జరిగింది. అనంతరం జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోమని అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలియజేయడం జరిగింది.