స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలి: పితాని బాలకృష్ణ

కాకినాడ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం: తాళ్లరేవు మండలం, చొల్లంగి గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబందించిన సుమారు 4 ఎకరాల ప్రభుత్వం భూమిని ఇండ్ల స్థలాల కోసం కాకినాడ రూరల్ వారికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ చొల్లంగి గ్రామ ప్రజలు, జనసేన పార్టీ నాయకులు పితాని బాలకృష్ణకి మొర పెట్టుకోవడం జరిగింది. తక్షణం ఈ విషయంపై జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ స్పందించి ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న భూములు వేరే నియోజకవర్గానికి కేటాయించడంపై గ్రామస్తుల తరపున గ్రామంలో ఉన్న లబ్దిదారులకు ఇవ్వకుండా వేరేవారికి ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల పట్టాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), అత్తిలి బాబురావు, సుంకర రామచంద్రరావు, దూడల స్వామి, అంకన ఆంజనేయులు, వెలుగుబంట్ల సూరిబాబు, కనకాల పెద్దబాబు, పితాని రాజు, వెలుగుబంట్ల వీరేంద్ర, బొబ్బిలి ఫణీంద్ర, జనసేన నాయకులు, చొల్లంగి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.