క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం రాజంపేట పట్టణం నందు గల ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ నందు బండ్ల నాగరాజు, జగదీష్, మహేష్ ల ఆధ్వర్యంలో రాజంపేట ప్రిమియర్ లీగ్ – ఆర్ పి ఎల్-2025 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.
ఈ టోర్నమెంట్ కు రెండవ బహుమతిని మరియు ప్రైజ్ మనీని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ప్రకటించగా గురువారం
జనసేన నాయకులు యల్లటూరు శివరామ రాజు గెలుపొందిన విజేతలకు బహుమతిని ప్రైజ్ మనీని అందించి క్రీడాకారులను అందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, జనసేన పట్టణ నాయకులు మావిళ్ల రవి, పలుకూరి శంకర్, నీటిసంఘం అధ్యక్షుడు నారదాసు రామచంద్ర, మౌల రాజంపేట ఎన్డీఏ కూటమి తెలుగుదేశంపార్టీ నాయకులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment