“డి3” సినిమాకు క్లాప్ కొట్టిన నిర్మాత దిల్ రాజు

‘నిన్ను తలచి’ ఫేం వంశీ యకసిరి హీరోగా “డి3” టైటిల్ తో మరో సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న దిల్ రాజు నటి నటులపై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ ని ఆశిర్వధించారు. ఈ సినిమాకు భాస్కర్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైం థ్రిల్లర్ డ్రామా లో తెరకెక్కనున్న ఈ సినిమాకు జయవర్ధన్ అంకె సంగీతం అందిస్తుoడగా.. బి.యెస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఒర్నటే పిక్చర్స్ ఏల్.ఏల్.పి బ్యానర్ల పై సంగెం బిక్షమయ్య మరియు కృష్ణ మేడ్గే లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ” భాస్కర్ చెప్పిన సరికొత్త కథ, క్రైం థ్రిల్లర్ నాకు బాగా నచ్చి వెంటనే ఒకే చెప్పాను, ఈ సినిమా ద్వారా కూడా ప్రేక్షకులను అలరించేందుకు పూర్తిగా కృషి చేస్తాను, మా సినిమాకు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డ దిల్ రాజు గారుకి నా కృతజ్ఞతలు అని తెలిపారు. దర్శకుడు భాస్కర్ రామ్ మాట్లాడుతూ మంచి కథ తో సినిమాతో సినిమా స్టార్ట్ చేశా, మంచి హిట్టు తో ప్రేక్షకుల ముందుకు వస్తా అని తెలిపారు.

ఇంకా ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మాకు అండగా నిలబడిన దిల్ రాజు గారికి, మా హీరో వంశీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.