అభ్యుదయవాది శ్రీ ఎన్.టి.రామారావు

తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో శ్రీ ఎన్.టి.రామారావు గారు కూడా ఒకరని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కొనియాడారు. సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజులలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించి అభ్యుదయవాదిగా శ్రీ ఎన్.టి.ఆర్. నిలిచారు. అటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నాను. తెలుగు భాషపై ఆయనకు ఉన్న మక్కువ, పట్టు నన్నెంతగానో ఆకట్టుకునేది. తెలుగు భాష కీర్తి ప్రతిష్టలను ఆయన దేశం నలుదిశలా వ్యాపింప చేసిన తీరు అమోఘం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన శ్రీ ఎన్.టి.రామారావు గారి జయంతి సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన అంజలి ఘటిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.