వైసీపీ ప్రభుత్వ అకృత్యాలపై పిఠాపురం నియోజకవర్గంలో నిరసన సెగ

పిఠాపురం నియోజకవర్గ జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష సమక్షంలో పట్టణ జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ నాయకత్వంలో పిఠాపురం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి అయిన దళిత బిడ్డ బలికిరి ప్రణయ్ కుమార్ దారుణ హత్యకు కారణమైన వైసీపీ అకృత్యాన్ని గూండాయిజాన్ని ఖండిస్తూ, ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరియు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలాన్ని ఇచ్చారన్న ఆక్రోసంతో ఇప్పటం గ్రామస్తుల ఇళ్లను అన్యాయంగా కూల్చివేసి అమాయకులను రోడ్డుపాలు చేసిన వైసిపి పాలనా దాష్టీకాన్ని ఎండగడుతూ నినాదాలు పలుకుతూ ఫ్లెక్స్ బ్యానర్లను ప్రదర్శించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీటీసీ అభ్యర్థులు, కౌన్సిలర్ అభ్యర్థులు, వార్డు నెంబర్లు, పలువురు దళిత నాయకులు మరియు నియోజకవర్గ జనసైనికులు పాల్గొనడం జరిగినది.