రైతులను వెంటనే ఆదుకోవాలని రాజోలు జనసేన నిరసన ర్యాలీ

రాజోలు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు నిరసన తెలియజేశారు. రాజోలు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద మహనీయుల విగ్రహాలకు పూల మాలలు వేసి అక్కడ నుండి జనసేన నాయకులు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో కార్యాలయం వద్ద తహిశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయంలో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రికల్చర్ 21 శాతానికి పడిపోయిందన్నారు. ఇదే సమయంలో పక్క రాష్ట్రంలో 18 నుంచి 23 శాతానికి పెరిగిందన్నారు. రైతులకు ఏ విధంగానూ ఈ ప్రభుత్వాలు సహకరించడం లేదని ఆయన విమర్శించారు. రైతులు ఎకరాకు 25 వేల రూపాయల వరకు నష్టపోతున్నారని, ఇది ఇలాగే ఉంటే వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మా అధినేత పవన్ కళ్యాణ్ రైతులకు ఎప్పుడూ అండగానే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ జనసేన నాయకులు, మండల అధ్యక్షులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.