ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని నిరసన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దమన కాండకు వ్యతిరేకంగా భైంసా పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చెవులు, కళ్లు, నోరు మూసుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు హజరై మాట్లాడుతూ ఆశ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం వైద్య శాఖ కమీషనర్ కార్యాలయం ముందర శాంతి యుత పోరాటం చేస్తుంటే మహిళ ఉద్యోగులని చూడకుండా అత్యంత దారుణంగా పోలీసులతో వాళ్ళను ఈడ్చుకుంటూ అరెస్టులు చేశారు. అంతకు ఒకరోజు ముందు ఆశలను ముందస్తు హౌస్ అరెస్ట్ లు చేయడం ఎంత వరకు సమాంజసం అని ప్రశ్నించడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి ఇదే ఆశలు పోరాటం చేస్తే వారి టెంట్ కిందకు వెళ్లి అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలా రోడ్డు పాలు చేసారు. కనీసం వినతిపత్రం తీసుకునే పరిస్థితిలో లేరు. అతి తక్కువ పారితోషికంతో పని చేస్తూ ఆరోగ్య శాఖలో కీలక పాత్ర వహిస్తున్న వారిని పట్టించుకోక పోవడం చాలా దారుణం. కాబట్టి వెంటనే ఆశ వర్కర్స్ కు ఫిక్సిడ్ వేతనం 18000 ఇవ్వాలని, పిఎఫ్, ఇ ఎస్ ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనియెడల భవిష్యత్తులో జరగబోయే పోరాటానికి జనసేన పార్టీ పూర్తి మద్దతునిస్తుందని తెలియచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ మండల అధ్యక్షురాలు మారకంటి విజయ, లక్ష్మి, భైంసా పట్టణ అధ్యక్షురాలు మౌనిక, ఉజ్వల తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment