ముండ్లమూరు రోడ్ల దుస్థితిపై జనసేన – టీడీపీల ఆధ్వర్యంలో నిరసన

  • ఇదేమి పరిపాలన? ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కూరపాటి శ్రీనివాసరావు సూటి ప్రశ్న
  • మీకు పరిపాలించే అర్హత లేదు వెంటనే వైదొలగండి: వైసీపీకి జనసేన పార్టీ తోట రామారావు డిమాండ్

దర్శి నియోజకవర్గం: జనసేన తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలోని బొట్లపల్లి గ్రామంలో నేడు రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ మండల కమిటీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు – జనసేన పార్టీ ముండ్లమూరు మండల కమిటీ అద్యక్షులు తోట రామారావుల ఆధ్వర్యంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు రోడ్లపై గుంతలను ప్రశ్నిస్తూ, ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలేదని, కనీసం రాకపోకలకి గుంతలు లేని అనువైన రోడ్లను కూడా నియోజకవర్గంలో వేయలేని మీ పరిపాలన ఏమి పరిపాలన అని శ్రీ కూరపాటి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీకు అధికారం ఇస్తే ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఇదేమిపరిపాలన అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వార్థం మాని, సమర్థతతో చిత్తశుద్దిగా పరిపాలన చేయమని హితబోధ చేశారు. లేకుంటే ప్రజలు వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ప్రజల కష్టాలు తీర్చలేని వైసీపి పార్టీ కి ఇంక అధికారంలో కొనసాగే అర్హత లేదని, వచ్చే ఎన్నికలలో దానిని సాగనంపి జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో సుపరిపాలన తీసుకు రావాలని శ్రీ తోట రామారావు గారు ప్రజలను కోరారు. లేకుంటే ప్రజలకు కష్టాలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీల కూటమి అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకరాపురం సర్పంచ్ కూరపాటి నారాయణస్వామి, మారెళ్ళ ఎంపిటిసి పాలపర్తి సుబ్బారావు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, ముండ్లమూరు మండలకమిటీ ఉపాధ్యక్షులు అంచుల వీరాంజనేయులు, మండల కమిటీ ప్రధాన కార్యదర్శి నాము నాగేంద్ర, కార్యదర్సులు పులి కిషోర్, ఈదర గ్రామ కమిటీ అధ్యక్షులు సీదా రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు సోమేపల్లి శ్రీనివాసరావు, బద్రి గోపాల్ రెడ్డి, మానం నరసింహారావు, గోరంట్ల ఆంజనేయులు, చాగంటి రాంబాబు, గోపు లాలబాబు, పులిపాడు వెంకటేశ్వర్ రెడ్డి, చావా బ్రహ్మయ్య, గోరంట్ల హనుమంతరావు, తేలుకుట్ల రాంబాబు, కిలారి ఆంజనేయులు, బ్రహ్మనాయుడు, నందగోపాలు, బాజీ మరియు జనసేన పార్టీ నాయకులు బ్రహ్మయ్య, నవీన్, బ్రహ్మనాయుడు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.