- సమిష్టి కృషితోనే ఆవిర్భావ సభ చారిత్రాత్మకంగా నిలిచింది
- ప్రజలతో మరింత మమేకం అవ్వండి
- పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయసాధనకు కృషి చేయటం ప్రతీ ఒక్కరికీ గర్వకారణమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం అవ్వటంలో అన్నీ తానై వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ ను జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి కలిసి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా, లెక్కకందని, ఊహకందని స్థాయిలో ప్రజానీకం హాజరైన ఆవిర్భావ సభలో ఎటువంటి సమస్యలు కలగకుండా పక్కా ప్రణాళికతో సభ విజయవంతానికి అహరహం శ్రమించిన నాదెండ్ల మనోహర్ మాలాంటి ఎంతోమందికి ఆదర్శనీయులని ఆళ్ళ హరి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ను పార్టీ శ్రేణులు దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు. ఇంతటి మహత్కార్యం ఏ ఒక్కరితోనే సాధ్యం కాదని అందరి సమిష్టి కృషితోనే సభ విజయవంతం అయిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన సాధించిన విజయంతో జనసైనికులపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజలు జనసేనపై ఎంతో నమ్మకంతో పెట్టుకున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమించాలన్నారు. ప్రజలతో మరింత మమేకమవ్వాలని జనసైనికులకు నాదెండ్ల పిలుపునిచ్చారు. నాదెండ్ల మనోహర్ నః కలిసిన వారిలో జనసేన నేతలు మెహబుబ్ బాషా, కొండూరు కిషోర్, మిద్దె నాగరాజు, సాయి తదితరులున్నారు.
Share this content:
Post Comment