నిజాయతీ చాటుకున్న సత్యవేడు జనసైనికులు…!

సత్యవేడు నియోజకవర్గం, సత్యవేడు మండలములోని గంగుల కండ్రిగ గ్రామానికి చెందిన ఈశ్వరి తన బిడ్డని ఆసుపత్రికని సమీపంలో ఉన్న ఉతుకోట కి బస్సులో ప్రయాణించిన ఆమె తన దగ్గర ఉన్న నగదు పరసుని బస్సులోనే జారవిడుచుకున్నారు. ఆ పర్సు అదే బస్సులో ఎక్కిన వెల్తురు కండ్రిగ గ్రామానికి చెందిన సమ్మెట శివరాజు అనే జనసైనికుడుకి దొరకడంతో సత్యవేడు నియోజకవర్గం జనసేననాయకులైన శ్రీ హేమ సుందరంకి తెలుపడం జరిగింది. ఆ పరసుని క్ష్న్నంగా పరిశీలన చేసి అందులో డ్వాక్రా సంఘానికి సంబందించిన ఎస్ బి ఐ బ్యాంక్ నెంబరు ఆధారంగా వారిని గుర్తించి వారికి పోగొట్టుకున్న నగదు పర్సుని వారికి తిరిగి అందజేయడం జరిగింది. అందుకున్న ఈశ్వరి జనసేన నాయకులకి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.