ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి: RTC MD సజ్జనార్

ఆర్ టిసి ఎండి విసి సజ్జనార్ శనివారం ఉదయం నల్లగొండ బస్టాండ్ లో తనిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి ఆయన బస్సులో నల్లగొండకు వచ్చారు. ఈ క్రమంలో నల్లగొండ బస్టాండ్ లో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన బస్టాండ్ లో మొక్కలు నాటారు. ఆర్ టిసి సేవలపై సజ్జనార్ ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆర్ టిసి కార్గో సేవలను సైతం ఆయన పరిశీలించారు. ఆపై ఆయన ఆర్ టిసి అధికారులతో భేటీ అయ్యారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన అధికారులకు సూచించారు.