మాలగుమ్మి ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించండి: జనసేన డిమాండ్

అరకు నియోజకవర్గం, ముంచంగిపుట్టు మండలంలో మాలగుమ్మి గ్రామంలో సుమారుగా 75 కుటుంబాలు జీవిస్తున్నారు. ఈ గ్రామంలో గత పది రోజుల నుండి కుళాయిల నుండి పూర్తిగా నీరు రావడం లేదు. ఈ కారణంగా గ్రామ ప్రజలు కలిషితమైన నీరు తాగే పరిస్థితి వస్తుంది. ఈ కలుషితమైన నీరు తాగటం వలన విష జ్వరాలు, జలుబు, దగ్గు ఇలా అనేక రకమైన రోగాలతో గ్రామ ప్రజలు ఇబ్బంది గురవుతుంటే. ప్రభుత్వ అధికారులు కానీ అధికారంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజా సమస్యను ఎందుకు పరిష్కారం చూపటం లేదు. ఇప్పటికైనా ఈ గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని. జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ జనసేన తరఫున కోరడమైనది.