- తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
- సామినేని ఉదయభానుకి వినతి పత్రం అందజేసిన గృహ నిర్మాణ సంస్థ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
జగయ్యపేట పట్టణం, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను గారిని వారి స్వగృహం నందు కలిసి గృహ నిర్మాణ సంస్థ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ అంశం పై సానుకూలంగా స్పందించిన ఉదయభాను, త్వరలో గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్ధసారధి గారి ద్వారా సమస్యలను పరిష్కరించే విధంగా మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్షులు శేషం తిరుపతిరావు, పి. బుజ్జి బాబు, బి రామారావు, ఎం మహేష్ బాబు, షాక్ మొహమ్మద్, కె ప్రశాంత్ రాయ్, ఆర్ శ్రీకాంత్. వి నాగరాజు, కె నాగరాజు పాల్గొన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది వారి వినతి పత్రం వివరములు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ వినతి పత్రంలో మా కార్పొరేషన్ స్థాపించి మా కుటుంబంలో వెలుగులో నింపిన మహనీయుడు కూడు, గుడ్డ నినాదం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం తో ఆనాడు 1983లో పక్కా గృహాలకు సేకరించి మా కార్పొరేషన్ స్థాపించారని తెలిపారు. 19 సంవత్సరాలు నుండి చాలీచాలని జీతంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మాకు ఒక్కసారిగా 2017 లో నాలుగు వేల రూపాయలు జీతం నుంచి 15,500 వరకు అందించిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని తెలిపారు. ప్రస్తుతము సదురు సంస్థ నందు 80 శాతం మంది ఉద్యోగులు రిటైర్మెంట్ పొంది ప్రస్తుతం 20 శాతం మంది పర్మినెంట్ ఉద్యోగులతోను మిగిలిన ఖాళీలలో ఔట్సోర్సింగ్ సిబ్బందితో పనిచేయుచున్నారు. మేము గతంలో అనగా 2014-2019 మధ్యకాలంలో గృహ నిర్మాణ సంస్థలో మండలానికి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ మరియు ఒక డిఈఓ మాత్రమే ఉండి ఒకటి 6,29,989 గృహములను నిర్మాణం చేయగలిగారు. గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా మండలానికి 14 లేదా 15 మంది సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ద్వారా 11,59,407 గృహములు మాత్రమే నిర్మాణం చేయగలిగినారు. మేము క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసి వారికి అవగాహన కల్పించి గృహనిర్మాణం చేయించడంలో అనుభవం కలిగి ఉన్నాము కాబట్టి గతంలో 2014-2019 కాలములో మేము విధులు నిర్వహించినట్లుగా ఆ యొక్క విధులు మాకు ఇప్పించవలసిందిగా తమరిని మిక్కిలిగా కోరుచున్నాము. మేము గత 18 సంవత్సరముల నుండి ఈ సంస్థను నమ్ముకుని పనిచేయుచున్న వర్క్ ఇన్స్పెక్టర్లు, డిఇఓలు, ఐ టి మేనజర్లు, మరియు ఇతర క్యాడర్ లలో రాష్ట్ర వ్యాప్తముగా 2600 మంది సిబ్బంది అవుట్ సోర్సింగ్ విధానములో అతి తక్కువ జీతాలతో నేటికి రు 16411/-మాత్రమే తీసుకుంటూ.. మేము మాయొక్క భార్య పిల్లలు మరియు వృద్ధాప్యంలో ఉన్న తల్లితండ్రులతో జీవనము సాగిస్తున్నాము బయట మార్కెట్లో నిత్యావసర ధరలు బాగా పెరిగి మేము మా యొక్క కుటుంబములను పోషించుకొనుట కష్టముగా మారినది కావున తమరు మా యందు దయఉంచి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన మా కార్పొరేషన్ అంతరించిపోకుండా మిమ్మల్ని హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులుగా గుర్తించి మా భాద్యతలు మాకు ఇపించగలరని మాకు ఉద్యోగ భద్రత కలిపించాలి అని మా యందు దయవుంచి నందమూరి తారక రామారావు స్థాపించిన మా కార్పొరేషన్ అంతరించిపోకుండా మమ్మల్ని హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులుగా గుర్తించి మా బాధ్యతలు మాకు ఇప్పించగలరని మరియు వర్క్ ఇన్స్పెక్టర్లు, ఐటి మేనేజర్లు ఔట్సోర్సింగ్ సిబ్బందిని హెచ్ ఆర్ విధానం లేదా కాంట్రాక్టు లోకి మార్పు చేసి న్యాయం చేయాలని సామినేని ఉదయభానుని కోరారు. మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకములకు అర్హులుగా గుర్తించాలని తెలిపారు. మేము మా కుటుంబాలు ఎప్పుడు కూడా తమరికి మరియు తమ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియజేశారు.
Share this content:
Post Comment