ఒంటరి మహిళలకు పిఎస్ఎన్ మూర్తి టీం క్రిస్మస్ కానుక

పిఠాపురం, నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్థానిక మిరపకాయలు వీధి పదో వార్డులో పిఎస్ఎన్ సోమవారం ఒంటరి మహిళలకు 25 మందికి క్రిస్మస్ కానుకను పిఠాపురం జనసేన నాయకులు పిఎస్ఎన్ మూర్తి టీం అందజేయడం జరిగింది. పవన్ రావాలి… పాలన మారాలి… అనే నినాదంతో అక్కడ మహిళలు అందరూ కూడా హర్ష వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది ఎక్కడా లేదని పవన్ అన్నను చూస్తే ఒక నమ్మకం భరోసా కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పిండి శ్రీనివాసు, టైల్స్ బాబీ, పెంకే జగదీష్, కోలా దుర్గాదేవి, కోన సుధారాణి, పెద్దిరెడ్ల భీమేశ్వరరావు, పబ్బి రెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, మరియు పిఎస్ఎన్ మూర్తి, నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.