సైకో జగన్ కి ప్రజలు సుభిక్షంగా ఉంటే నచ్చదు

  • కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులకు మద్దతుగా జనసేన
  • మాట తప్పిన జగన్ డౌన్ డౌన్
  • నమ్మక ద్రోహం చేసిన జగన్ డౌన్ డౌన్..

నెల్లూరు: కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టర్లు శాంతియుత నిరసనలు చేస్తుంటే నోటీసులు ఇవ్వడం సిగ్గో సిగ్గు.. అంటూ సిఐటియు నిరసనలకు సోమవారం జనసేన పార్టీ తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ హాజరై మద్దతు తెలిపారు. మున్సిపల్ కార్మికులు గత నెల 26వ తేదీ నుంచి జగన్ రెడ్డి గారు మాటిచ్చినట్లుగా కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాల్సిందేనని సీ ఐ టి యూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి విదితమే.. శాంతియుతం గా నిరసనలు చేస్తున్న ఉద్యోగులకు జగన్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నోటీసులను గాంధీ బొమ్మ వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. ఈ సన్నాసి ప్రభుత్వానికి సైకో జగన్ కి ప్రజలు సుభిక్షంగా ఉంటే నచ్చదు పనిచేసే వారికి జీతాలు ఇవ్వలేని పనికిమాలిన ప్రభుత్వం అందరికంటే ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి మున్సిపల్ కార్మికులు పనిచేయకపోతే నగరం అంతా అపరిశుభ్రమైపోతుంది. గత నెలలో కురిసిన వాన లో కూడా మోకాళ్ళ లోతు రోడ్ల పైనే ఉన్న మరుగును కాలువలు, డ్రైన్ క్లీన్ చేసి వ్యర్ధాలను పూడిక తీయకపోతే నీరు రోడ్లపైనే నిలిచి ఉండేది, వారి సేవలను విస్మరించడం సబబు కాదు. గతంలో వైసిపి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరికి మద్దతు గా కాంట్రాక్టు బేసిస్ మీద ఉన్నవారిని పర్మినెంట్ చేస్తామని మాట ఇచ్చి ఈ రోజు మాట తప్పారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వీరికి నోటీసులు ఇవ్వడం హేయమైన చర్య, చేతగాని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా తరిమికొట్టాలి. ఎంతో కష్టనష్టాల కోర్చి పనిచేస్తున్న వీరికి పనికి కనీస వేతనం ఇవ్వాలి. అదే విధంగా పర్మినెంట్ చేయాలి అంటూ వీరి నిరసనలకు మద్దతుగా జనసేన పార్టీ తరఫున నిలుస్తున్నాం. వేరి డిమాండ్లన్నిటిని కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పంపించి రానున్న ప్రజా ప్రభుత్వంలో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తామని తెలిపారు.