*రాజకీయాల కొరకు ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడని వ్యక్తి జగన్
*రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం, వైసిపి పాలనలో ప్రజలు సైకో పరిపాలనను అనుభవించారని తద్వారా వైసిపి ప్రభుత్వాన్ని 11 సీట్లతో పరిమితం చేశారని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు వైసీపీను రప్ప రప్ప లాడించాలని ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నిజాయితీగల రాజకీయాలు చేయాలని అన్నారు. రాజకీయాలు కొరకు ప్రాణాలను ఇస్తే ఎందుకు సైతం వెనకాడనే వ్యక్తి సైకో జగన్ అని ఘాటుగా విమర్శించారు. బెట్టింగ్ యాప్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి విగ్రహాన్ని ప్రారంభించడానికి అని వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి ఇరువురు ప్రాణాలను కారు క్రింద నలిపి బలి చేసుకున్నారని అన్నారు. కారులో ఉండి కూడా చూసి చూడనట్టు వ్యవహరించిన జగన్ రాజకీయాల కొరకు గతంలో సొంత బాబాయిని కూడా పొట్టన పెట్టుకున్నాడని అన్నారు. జగన్ పాలనలో దళిత డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడినిగా చిత్రీకరించిన సంఘటన, రాజకీయ లబ్ధి కొరకు గులకరాళ్ళతో కొట్టించుకున్న సంఘటన, కోడి కత్తి కేసు, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వంటి అనేక దుర్మార్గపు పరిపాలన తో లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మనిషి మరణించిన అనంతరం కూడా సొంత మీడియా ద్వారా తమ తప్పు లేదన్న సర్దుబాటు ధోరణి లో ప్రచారం చేయడం వారి నిరంకుశత్వాన్ని వెలికితీస్తుందన్నారు. సొంత ఎమ్మెల్యేలను సైతం నమ్మలేని జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ అసెంబ్లీలో హాజరు కాకపోవడం పై తీవ్రస్థాయంలో విమర్శించారు. వారికి ధైర్యం ఉంటే 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీ సభలో మాట్లాడాలని అన్నారు.అలా చేస్తే వారు చేసిన లిక్కర్ స్కాం, భారతి సిమెంట్ స్కాం, గంజాయి వ్యాపారం, ఖనిజాల వ్యాపారం ఇలా అన్ని వ్యవస్థలను అడ్డగోలుగా దోచుకున్న మాటలు సభలో రికార్డు అవుతాయన్న భయంతో హాజరు కావడంలేదని అన్నారు. పాపం పండి నేడు నేరం అనుభవిస్తున్న సైకో వైసిపి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేయడం వారి సంస్కారాన్ని బయటపెడుతుందని, వారి పాపాలు నేడు పండడంతో అనుభవిస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో తల్లికి వందనం, వృద్ధాప్య పింఛను, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దీపం పథకం ద్వారా గ్యాస్ గ్యాస్ సిలిండర్లు అందించడం వంటి అనేక పథకాలలో కేంద్రం సహకారంతో పూర్తిస్థాయిలో ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వచ్చే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు ప్రజలకు అంకితం చేసే విధంగా అభివృద్ధి పరుగులు తీస్తుందని, అమరావతి రాజధాని నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్ళనున్నట్లు తెలిపారు.
Share this content:
Post Comment