రామారావుపేటలో ప్రజా చైతన్య పోరాట యాత్ర

కాకినాడ సిటి: కాకినాడ జనసేన పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో కొనగళ్ళ పరశురాం & వాసిరెడ్డి సుబ్బారావుల ఆధ్వర్యంలో 40వ డివిజన్లో రామారావుపేట, శివాలయం వీధి ప్రాంతంలో ప్రజా చైతన్యపోరాటం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలతో కలిసి నేడు మన రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యలపై వివరించారు. సంవత్సరానికో జాబ్ కేలండరు అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాని ఊసు ఎత్తలేదన్నారు. చదివిన చదువులకి సరైన ఉద్యోగాలు లేక, కొత్త పరిశ్రమలు రాక నిరుద్యోగులు నిస్తేజం ఆవహించి క్రుంగిపోయిన పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకుందని విమర్శించారు. పాలనపైన అవగహన లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఫలితం ఇంతకన్నా ఆశించలేమని ప్రజలు బాగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. యువతకి ప్రోత్సాహం ఇవ్వని ఈ జగన్మోహన్ రెడ్డి పాలించే అర్హత కోల్పోయాడన్నారు. చదువుకున్న వారు, మేధావులు ఎన్నికలలో ఓటు వేయడానికి నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి వ్యక్తులు మళ్ళీ అధికారాన్ని పొందుతారని మరొక్కసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడబాల రాజేంద్ర ప్రసాద్, మేడూరి బాలకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, 41వ డివిజన్ నాయకులు వాసిరెడ్డి సత్యకుమార్, ఎం.టి బ్రమ్మాజీ, బండి సుజాత, బోడపాటి మరియ, సబ్బే దీప్తి తదితరులు పాల్గొన్నారు.