ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య కార్యక్రమం

కాకినాడ సిటి, జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో స్థానిక డైరీఫార్మ్ సెంటరు వద్ద పార్టీ శ్రేణులు ప్రజా చైతన్య కార్యక్రమం చేపట్టడం జరిగినది. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన స్కీముల్లోని స్కాములను జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఇటీవల చెప్పిన గేదెల కొనుగోలులో అవినీతిపై స్థానిక ప్రజలకి వివరిస్తూ చైతన్యాన్ని తీసుకువచ్చేలా ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈ వై.ఎస్.ఆర్ పార్టీ అధికారంలో చేస్తున్న అవినీతి తవ్వుతున్న కొద్దీ పుట్టలు పుట్టలుగా బయటకి ఇటీవల వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పాడి అభివృద్ధి చేస్తున్నామంటూ ఈ ప్రభుత్వం హడావిడిగా వై.ఎస్.ఆర్ చేయూత పధకంలో భాగంగా మహిళా సాధికారత అంటూ డ్వాక్రా మహిళలకు మినీ డైరీలు ఏర్పాటు చేస్తున్నాము. అందుకుగాను సుమారు ఐదు లక్షల పశువులను కొనుగోలు చేసి పంపిణీ చేసామని చెపుతున్నారనీ, కానీ వాస్తవంగా చూస్తే అందులో రెండు శాతం కూడా కొనుగోళ్ళు జరగలేదనీ కానీ నిధులను మాత్రం మింగేసారని తెలుస్తోందన్నారు. బి.సి ల పేరుచెప్పి కొన్ని వేల కోట్లు దిగమింగేసిన ఈ వై.సి.పి పార్టీ అసలు సాధికార యాత్రలో బి.సి ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. ముందుగా ఈ వై.సి.పి ప్రభుత్వం బి.సి లకు క్షమార్పణలు చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ ముఖ్యమంత్రి నోరు విప్పితే అబద్ధాలేనని ప్రజలకి అవగతమైందన్నారు. ఇది చాలా పెద్ద కుంభకోణమనీ దీన్ని ప్రజలు తెలుసుకోవాలని చైతన్య పరుస్తున్నామన్నారు. త్వరలో జనసేన పార్టీ తెలుగుదేశంల ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా దీనిపై నిగ్గుతేల్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, మడ్డు విజయ్, శ్రీమన్నారాయణ, మనోహర్లాల్ గుప్తా, దాసరి వీరబాబు, శివాజీ యాదవ్, సుంకర సురేష్, దుర్గాప్రసాద్, చీకట్ల వాసు, ఏసేబు, రవిశంకర్, రమణారెడ్డి, దారం సతీష్, అమర్నాథ్, జాక్ మరియు వీరమహిళలు హైమావతి, మరియా, దీప్తి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.