ట్రాఫిక్ రూల్స్ పై పబ్లిక్ కు అవగాహన

బొబ్బిలి: శ్రీ కళా భారతి సెంటర్, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, కోర్ట్ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, ఎన్టీయార్ బొమ్మ సెంటర్ లలో… ఆనందోబ్రహ్మ క్రియేటివ్ డాన్స్ అకాడమీ అధ్యక్షులు ఎం విజయ మోహన్ రావు, కోఆర్డినేటర్ జి. కరుణ కుమార్ బొబ్బిలి ఎస్సై సిహెచ్ సత్యనారాయణ ఫ్లాష్ మాబ్ డాన్సులు ప్రదర్శన జరిగాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం, హెల్మెట్ వినియోగం, రష్ డ్రైవింగ్ లపై పబ్లిక్ నకు అవగాహన కల్పించారు. ఏబిసిడి విద్యార్థులు ప్రతి సెంటర్లోనూ 10 నిమిషాలు చొప్పున హుషారుతించే డాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో కళాభారతి ప్రధాన కార్యదర్శి నంబియార్ వేణుగోపాల్, జనసేన పార్టీ నాయకులు సంచాన గంగాధర్, పల్లెం రాజా, చీమల సతీషు, అలజంగి సంతోష్, గంగాధర్ మాస్టారు, హ్యాపీ క్లబ్ ప్రతినిధులు కృష్ణ అప్పారావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.