కాకినాడ సిటీ జనసేన ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పోరాటం యాత్ర

జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో డివిజన్ నాయకులు రామిరెడ్డి నగేష్ మరియు గట్టిమి దుర్గాప్రసాద్ల ఆధ్వర్యంలో 45వ డివిజన్ మధ్య రామాలయం, కొండయ్య పాలెం ప్రాంతం దగ్గర ప్రజా చైతన్య పోరాటం యాత్ర జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు ప్రజలను కలిసి ఈ వై.సి.పి ప్రభుత్వ వైఫల్యాలను వివరించి చైతన్య పరచారు. ఒకనాడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అని, రాజకీయ చైతన్యం కలిగిన నేల అని పేరుపొందిందనీ మరి నేడు రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలు అవుతోందన్నారు. గొప్ప గొప్ప మేధావులుగా కొనియాడబడే నీలం సంజీవ రెడ్డి, పి.వి. నరసిమ్హారావు లాంటి వాళ్ళను దేశానికి అందిస్తే నేడు అవినీతి కేసులతో కుబేరులు ప్రభుత్వాన్ని ఏర్పరచి పాలిస్తున్నారన్నారు. ఆనాడు పెద్దలు చెప్పినట్టు మేధావులు మౌనం వహిస్తే అవినీతిపరులు నేరస్తులు పాలకులు అవుతారన్నది నేడు నిజమైందని విమర్శించారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే గోతులతో రోడ్లు, నిరసనలతో ప్రభుత్వ కార్యాలయాలు, అసంత్రుప్తితో ప్రభుత్వ ఉద్యోగులు దారిద్ర్యంతో పేదలు తప్ప అభివృధి మచ్చుక్కి కనపడట్లేదనీ, ఒక్క వై.సి.పి నాయకుల, ఈ ముఖ్యమంత్రి ఆస్తులు మాత్రం విశేషంగా కొండల్లా పెరిగాయని విమర్శించారు. ఈ అసమర్ధ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజా చైతన్య పొరాటం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, చీకట్ల శ్రీనివాస్, హైమావతి, బండి సుజాత, చోడిపల్లి సత్యవతి, బోడపాటి మరియ తదితరులు పాల్గొన్నారు.