కార్యకర్తలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీకి ప్రజల్లో మద్దతు పెరుగుతుంది: గునుకుల కిషోర్

నెల్లూరు, జనసేన క్రియాశీలక సభ్యత్వం మూడో విడత మరో రెండు రోజుల్లో ముగియనున్నది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుతో స్వచ్ఛందంగా ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీలో యువత క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత14 రోజుల్లో జనసేన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీల సభ్యత్వం మూడో విడతలో దాదాపు 300 మంది యువత స్వచ్ఛందంగా వచ్చి క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం జరిగింది. కార్యకర్తలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీకి ప్రజల్లో మద్దతు పెరుగుతుంది, ఎంతోమంది గృహిణులు తాము జనసేన కుటుంబ సభ్యులం అని జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకొని గర్వంగా తెలిపారు. గత సంవత్సరం బాలాజీ నగర్ నందు ఒక క్రియాశీలక సభ్యుడు ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ తరపున అందించి వారి కుటుంబానికి భరోసాగా నిలవడం జరిగింది. మరో రెండు రోజుల్లో ముగియనున్న ఈ జనసేన పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని జనసేన నాయకులు, మద్దతుదారులు, కార్యకర్తలు, మెగా అభిమానులు బాధ్యతగా తీసుకొని కొత్త వారి చేత నమోదు చేయటం, పాతవారిని రెన్యువల్ చేయించడం విధిగా పాటించాలి అని తెలిపారు. కార్యకర్తలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ప్రజలను ఇంకెంత బాగా చూసుకుంటారని ప్రజల నుంచి పాజిటివ్ టాక్ నడుస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు పవన్ కళ్యాణ్, ఓంకార్, లక్ష్మీకాంత్, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.