గుర్రాలపాలెం గ్రామంలో ప్రజాబాట

లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఎచ్చర్ల నియోజకవర్గ నాయకులు అర్జున్ భూపతి ఇంటిఇంటికి వెళ్ళినప్పుడు ప్రధానంగా త్రాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య ఉందని గ్రామ మహిళలందరూ కూడా జనసేన పార్టీ అయినా దీన్ని ఎట్టిపరిస్థితిలో పరిష్కరించాలని, గతంలో ఉండే ప్రభుత్వం మీద ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం పోయిందని ఈ సమస్యను జనసేన పార్టీ మాత్రమే మాకు తీరుస్తుందని భావిస్తున్నామని చెప్పడం జరిగింది. అదే విధంగా జనసేన పార్టీ ఈ రెండిటిపైన పోరాటం చేసి మీ గ్రామంలో ఈ రెండు సమస్యలు తీరే అంత వరకు మేము దీనిపై పోరాటం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.