శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఫూజలు

శ్రీ వాసవి ఆలయంలో పూజలు జనసేన అధి నేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర అన్ని విధాల విజయవంతము కావాలని వివిధ దేవాలయాలలో పూజలు చేయిస్తున్నారు. పూజలలో భాగంగా అమలాపురం మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పవన్ కళ్యాణ్ పిఏ అంజిబాబు, పవన్ కళ్యాణ్ పేరు మీద అమ్మవారికి సహస్రనామాలతో తామర పుష్పాలతో అర్చన చేయించి అమ్మవారికి పట్టుచీర రవిక సమర్పించారు. అంజిబాబు వెంట జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ మర్యాద ప్రకారము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘ అధ్యక్షులు యెఒడూరి వేంకట్రామయ్య కార్యదర్శి నంబూరి సత్యనారాయణమూర్తి, ఉత్సవ కమిటీ చైర్మన్ నందిపాటి శ్రీనివాస్, సంఘ కార్యవర్గ సభ్యులు వరదా సూరిబాబు, నూలు కృష్ణ, కాళ్లకూరి బుజ్జి, అప్పన వీరన్న, మండవిల్లి నాగేశ్వరరావు మరియు శ్రీఖకొలపు రాంపండు తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.