వాలంటీర్ వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి

  • ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య

ఆళ్ళగడ్డ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏలూరు సభలో మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేకరించిన ప్రజల బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్, మొబైల్ నెంబర్స్ మొదలైన వివరాల సమాచారంపై వైసీపీ ప్రభుత్వం భద్రతను తప్పుబడుతూ.. కొంతమంది వాలంటీర్ల వలన మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆళ్ళగడ్డ వైసీపీ ఎమ్మెల్యే, నాయకులు బలవంతంగా కొద్దిమంది వాలంటీర్ల చేత పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను కాల్చడాన్ని ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకు వైసిపి ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5000 వేలకు మరో 5000 వేలు అదనంగా ఇవ్వాలని కోరుకునే వ్యక్తి తప్ప వాలంటీర్ ల పొట్ట కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయలేదని తెలియజేశారు. డిగ్రీలు చేసిన యువతతో 5000 జీతం ఇస్తూ.. బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సంవత్సరానికి 2,30,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వక పోవడాన్ని తీవ్రంగా ఖండించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కో నియోజకవర్గంలో 500 మంది యువతకు ఒక్కొక్కరికి చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి, తద్వారా మరింత మందికి ఉపాధి అవకాశం కల్పించే విధంగా యువతకు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో చేర్చారని తెలియజేశారు. జనసేన కార్యకర్తలు పాలసీ విధానాల మీద వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ప్రజల తరఫున మాట్లాడుతుంటే వైయస్సార్సీపి సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, పెళ్లిళ్ల గురించి పోస్టులు చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి, వారి కుటుంబంలోని ఆడవారి వ్యక్తిగత జీవితం గురించి మేము ఎప్పుడు పోస్ట్లు చేయలేదు. ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు విలువలతో కూడిన సంస్కారం నేర్పారు కనుక. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నాయకులను ఓడించే బాధ్యత ఆళ్ళగడ్డ నియోజకవర్గం జనసైనికులు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పసుల నరేంద్ర యాదవ్, వేముల కోటి, ఆంజనేయులు, రమణాచారి, సజ్జల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.