మనిషి జన్మ విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు శ్రీరాముడు: డాక్టర్ కందుల నాగరాజు

విశాఖ, మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు శ్రీరాముడని దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. దక్షిణ నియోజకవర్గంలోని పలు వార్డులలో గల ఆలయాలలో డాక్టర్ కందుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 30, 32, 33, 34,35, 36, 37, 39 వార్డులలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ భారతదేశంలో ధర్మ బద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడని చెప్పారు. మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కుల మతాలు కతీతంగా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అభిలాషించారు. ఆ శ్రీరాముని ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వచ్చేది కచ్చితంగా శ్రీరామరాజ్యం అని చెప్పారు. జనసేనకు పెరుగుతున్న ఆదరణ బట్టి చూస్తే కచ్చితంగా తమ పార్టీ ఎన్నికలలో ప్రత్యర్థి పార్టీలను దీటుగా ఎదుర్కొని ఊహించని విజయం సాధించి ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు, త్రినాధ్, గాజుల శ్రీను, రఘు, మంగ, టి.అరుణ, కుమారి, రోజి, జోగి, పవన్, సతీష్, అశోక్, యజ్ఞేశ్వరి, నగేష్, కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్ తో పాటు పలువురు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.